తొలి సోషలిస్టు విప్లవనేత లెనిన్‌కి ఘన నివాళులు

Jan 21,2024 16:17 #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : సోషలిస్టు మహా విప్లవనేత వి.ఐ.లెనిన్‌ శత వర్ధంతి సభ ఆదివారం స్ధానిక సుందరయ్య భవన్‌లో కె.వీరబాబు అధ్యక్షతన జరిగింది. సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, సిపిఎం సీనియర్‌ నాయకులు దువ్వ శేషబాబ్జి మాట్లాడుతూ.. మార్క్స్‌, ఎంగెల్స్‌ తరువాత మార్క్సిస్టు మహౌపాధ్యాయునిగా లెనిన్‌ చరిత్రలో చిరస్థానం సంపాదించుకున్నరని తెలిపారు. మార్క్స్‌-ఎంగెల్స్‌, సిద్ధాంతానికీ, ఆచరణకూ మధ్య ఉన్న గతితార్కిక సంబంధాన్ని ఆచరణలో చూపించడం ద్వారా అక్టోబర్‌ విప్లవం సాధించాడని తెలిపారు. సిపిఎం నాయకులు పలివెల వీరబాబు, తిరుమల శెట్టి నాగేశ్వరరావు, ఆర్‌.పి.ఐ.రాష్ట్ర నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌. రమణి, కె.సింహాచలం, సీహెచ్‌.అజరు కుమార్‌, టి.రాజా, మేడిశెట్టి.రమణ,, ఈశ్వరి, వేణి, మలకారమణ, జుత్తుక శ్రీనివాస్‌, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️