అధిక రసాయనాలు వినియోగిస్తే అనర్థం

రైతు సదస్సు

అధిక రసాయనాలు వినియోగిస్తే అనర్థం

మత్సవానిపాలెంలో విజయవంతమైన రైతు సదస్సు

ప్రజాశక్తి -కొత్తకోట : అధిక రసాయనాల ఉపయోగిస్తే అనర్థమని ి వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్‌ మోషే, స్కైకాస్‌ అన్నారు. గురువారం కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయం,పని అనుభవ కార్యక్రమంలో భాగంగా నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులు స్కైకాస్‌ కళాశాల విద్యార్థులు మత్సవానిపాలెం గ్రామంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్‌ మోషే, స్కైకాస్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రైతులు పడుతున్న ఇబ్బందులను వ్యవసాయకళాశాల విద్యార్థులు తెలుసుకొనుటకు ఇది చక్కని కార్యక్రమ మన్నారు. ఈసందర్భంగా నూతన సాంకేతికను తెలియజేసేలా విద్యార్థులు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌లో ప్రాజెక్టులను గురించి రైతులకు శాస్త్రవేత్తలు పరిశీలించారు. అధిక రసాయనాల ఉపయోగిస్తే ఎటువంటి అనర్ధాలు జరుగుతాయో నాటకం రూపంలో రైతులకు వివరించారు. ఆనంతరం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌. రాజ్‌ కుమార్‌, శాస్త్రవేత్తలు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఎన్‌. సత్తిబాబు, కిషోర్‌ కుమార్‌ బాబు, సర్పంచ్‌ గణేష్‌, ఎంపీటీసీ లోవరాజు, మాజీ సర్పంచ్‌ తాతబాబు, ఉప సర్పంచ్‌ సత్తిబాబు, పలువురు రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రైతు సదస్సు

➡️