తూర్పు టిడిపికి పట్టాభిరామ్‌ వెన్నెముక : వెలగపూడి

Jun 17,2024 00:04 #Chode Pattabiram Birth day
Chodi pattabhi ram Birth day

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : ఎంవిపి.కాలనీలోని ఉషోదయ జంక్షన్‌ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చోడె పట్టాభిరాం 62వ జన్మ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు హాజరై మాట్లాడారు. విశాఖ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాఖకు చోడె పట్టాభిరామ్‌ వెన్నెముక వంటి వారన్నారు. నియోజకవర్గంలో తన గెలుపు వెనుక చోడె పట్టాభిరాం ఉన్నారన్నారు. అతని అమూల్యమైన సేవలు పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు చాలా కీలకమన్నారు. ఎమ్మెల్యే సతీమణి వెలగపూడి సృజన మాట్లాడుతూ, తూర్పులో ఎమ్మెల్యేగా వెలగపూడి విజయం వెనుక పట్టాభిరాం కృషి చాలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ టిడిపి నాయకులు బైరెడ్డి పోతనరెడ్డి, తెడ్డు రాజు, తెడ్డు నూక రత్నం, గొలగాని పోలారావు, పీతల అమరేంద్ర, బొట్ట వెంకటరమణ, 17వ వార్డు నాయకులు చిన్నిపిల్లి నరేంద్ర, వాసు, శివ, ఆనంద్‌, శ్రీను, తారక్‌, బిసి నాయకులు ఆడారి కామేశ్వర రావు, కాళ్ల శంకర్‌, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం చోడె పట్టాభిరామ్‌ మాట్లాడుతూ, తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.శుభాకాంక్షలు తెలిపిన పుక్కళ్ల ధనలకీëశంకర్‌ చోడె వెంకట పట్టాభిరామ్‌ జన్మదినం సందర్భంగా 18 వార్డు కార్పొరేటర్‌ పుక్కళ్ల ధనలక్ష్మి, శంకర్‌ దంపతులు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

➡️