ఘోషా ఆస్పత్రి మూసివేత

Mar 25,2024 21:35

ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సెయింట్‌ జోసెఫ్‌ ఘోషా ఆస్పత్రిని మూసి వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 1987లో ఘోషా ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. మాత, శిశు సంరక్షణకు, సాధారణ వ్యాధులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేవారు. మారుతున్న పరిజ్ఞానంతో ఆస్పత్రికి రోగులు అనుకున్న స్థాయిలో వెళ్లక పోవడంతో నిర్వహణ భారమైంది. దీంతో ఆస్పత్రిని ఈనెల 31 నుంచి మూసివేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

➡️