జగనన్నకు చెబుదాంకు 311 వినతులు

Jan 22,2024 21:02

ప్రజాశక్తి-విజయనగరం కోట : జగనన్నకు చెబుదాంలో ప్రజల నుంచి వివిధ ప్రభుత్వ శాఖలకు వచ్చే వినతులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అధికారి ఎస్‌.డి.అనిత జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం జిల్లా స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్‌డిఒ ఎం.వి.సూర్యకళ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌లు వెంకటేశ్వరరావు, సుదర్శనదొర, సుమబాల తదితరులతో కలసి వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై 311 వినతులు వచ్చాయి. అత్యధికంగా రెవిన్యూ సమస్యలపై 255 వినతులు వచ్చాయి.

➡️