ప్రజారోగ్య భద్రతే లక్ష్యం

Jan 3,2024 21:19

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ప్రజల ఆరోగ్య భద్రతే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ధ్యేయమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర పునరుద్ఘాటించారు. బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్నిఒకటో డివిజన్‌ పూల్‌బాగ్‌ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవలను నిశితంగా కోలగట్ల పరిశీలించారు. వారికి అందిస్తున్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌వివి రాజేష్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, సహాయ కమిషనర్‌ ప్రసాదరావు, కార్పొరేటర్లు బండారు ఆనందరావు, మారోజు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️