బాధ్యతలు స్వీకరించిన జెసి కార్తీక్‌

Jan 31,2024 20:29

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా కొల్లాబత్తుల కార్తీక్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జెసిగా పనిచేసిన ఆయన, జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జెసి కార్తీక్‌కు వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై దృష్టి పెడతానని చెప్పారు. ముఖ్యంగా విజయనగరం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా నియోజకవర్గంపై దృష్టిసారిస్తానని, ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు. రెవెన్యూ అంశాలు, అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ, నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు, కౌలు రైతులకు రుణాలు, పంట కోత ప్రయోగాలు మొదలగు అంశాలతోపాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి వేగవంతం చేస్తామన్నారు. అనంతరం రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక తదితర శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. ఆయా శాఖల ప్రగతిపై జెసి చర్చించారు.

➡️