మూతపడిన గ్రామీణ బ్యాంకులు

Feb 23,2024 20:58

ప్రజాశక్తి-విజయనగరం కోట : దేశంలో ఉన్న 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులన్నిటిని కలిపి నేషనల్‌ రీజనల్‌ రూరల్‌ బ్యాంకుగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఫణికుమార్‌ సుదర్శన్‌, రీజనల్‌ సెక్రెటరీ అంబటి దుర్గా డిమాండ్‌ చేశారు. ఎఐఆర్‌ఆర్‌బిఇఎ పిలుపు మేరకు ఎపిజివిబిఒఎ, ఇయు ఆధ్వర్యాన శుక్రవారం ల్లా వ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. దీంతో జిల్లాలోని 52 ఎపిజివిబి బ్రాంచులు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా రూ.10 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. నగరంలో ఎస్‌పి బంగ్లా వద్దనున్న ఎపిజివిబి బ్రాంచి వద్ద ఎపిజివిబిఒఎ, ఇయు ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ బ్యాంకులపై స్పాన్సర్స్‌ బ్యాంకుల ఆధిపత్య ధోరణిని అరికట్టాలన్నారు. ఏళ్ల నుంచి బ్యాంకుల్లో పనిచేస్తున్న దినసరి వేతన కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 30 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. పెన్షన్‌ విధానాన్ని అన్ని స్పాన్సర్స్‌ బ్యాంకుల్లో ఉన్నట్టే గ్రామీణ బ్యాంకులకు వర్తింపజేయాలని డిమాండ్‌చేశారు. గ్రాడ్యుటి, లీవ్‌ రూల్స్‌, ప్రమోషన్‌ రూల్స్‌ని క్రమబద్ధీకరించాలన్నారు.

➡️