సిపిఎస్‌ ఉద్యోగులపై పోలీసుల నిర్భంధం

Feb 17,2024 20:26

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : సిపిఎస్‌ మాకొద్దు.. ఒపిఎస్‌ కావాలంటూ ఎపిసిపిఎస్‌ ఉద్యోగులు ఈనెల 18న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు భగం చేసేందుకు యత్నించారు. శనివారం సిపిఎస్‌ ఉద్యోగ సంఘాల నాయకుల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చి, చలో విజయవాడకు వెళ్లనీయకుండా గృహ నిర్భంధం, అరెస్టులు చేశారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి శ్రీరాములు, మీడియా ఇన్‌ఛార్జి గంటా శ్రీనివాస, మరి కొంతమంది ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చి అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా శ్రీరాములు, శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లనీయకుండా గృహ నిర్బంధం, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరూ విజయవాడలో జరిగే ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి తీరుతామన్నారు.

➡️