శేషగిరి 3వ వర్ధంతి సందర్భంగా సదస్సు

May 24,2024 12:49 #Vizianagaram

ప్రజాశక్తి-గరివిడి: మే 27న విజయనగరం శేషగిరి విజ్ఞాన కేంద్రంలో ‘విద్యారంగంలో పరిణామాలు – సవాళ్లు – కర్తవ్యాలు’ అనే అంశంపై జరుగు సదస్సును జయప్రదం చేయాలని యూటీఎప్ జిల్లా నాయకులు ఎ.సత్యశ్రీనివాస్ కోరారు. శుక్రవారం గరివిడి మండల విద్యాశాాధికారి కార్యాలయం ఆవరణలో గొడపత్రికని విడుదల చేసారు. అనంతరం సిబ్బందిని,ఉపాధ్యాయులను కలిసి ఆహ్వాన పత్రికలను అందించి సదస్సుకు రమ్మని పిలిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… విద్యారంగ ఉపాధ్యాయరంగ సమస్యలు పరిష్కారానికి సుదీర్ఘ ఉద్యమాన్ని నడిపిన యుటిఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర నాయకులు కే శేషగిరి మూడవ వర్ధంతి సందర్భంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయనగరం కేఎల్ పురం వద్ద శేషగిరి విజ్ఞాన కేంద్రంలో జరుగు ఈ సదస్సుకు ప్రధాన వక్తగా శాసనమండలి ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం పాల్గొంటున్నారని అన్నారు. అందరూ పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరారు.

➡️