పెన్సనర్లను పట్టించుకోరా..?

Jan 29,2024 16:39 #Vizianagaram
pensioner protest in vzm

అపరిష్కృత సమస్యలు పరిష్కారము చేయాలి
కలెక్టరేట్ ఎదుట ధర్నా

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పెన్షనర్లు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి పెన్షనర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా జరిగింది. ప్రభుత్వానికి అధికారులు ద్వారా వినతి పత్రము ధర్నా అనంతరం ఇవ్వడం జరిగింది. ధర్నాను ఉద్దేశించి పెన్షనర్లు ఐసోయేషన్ అధ్యక్షులు పెద్దింటి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పెన్సనర్లకు సంబంధించి పలు అపరిష్కృత సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరారు. 11వ పి.ఆర్.సి.లో తే.01-01-2022ది నుండి తగ్గించిన అడిషినల్ క్వాంటమ్ ను తిరిగి యదావిధిగా అంతకు ముందు ఇస్తున్నట్లు 70 సం॥లు నిండిన వారికి 10%, 75 సం||లు నిండిన వారికి 15% కు పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డి.ఆర్. బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. 11వ పి.ఆర్.సి. ఎరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డు ద్వారా అన్ని వ్యాధులకు అన్ని గుర్తింపు పొందిన హాస్పిటల్స్లో వైద్యము అందించాలన్నారు. మెడికల్ రీ-ఇంబర్స్మెంట్ పరిధి 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పెన్షనర్లు సంఘం జిల్లా కార్యదర్శి, జి.నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షలు జి ఆర్ రాఘవ రాజు, తాలుక యూనిట్ అధ్యక్షడు
వి. సూర్య నారాయణ, కార్యదర్శి సి హెచ్ త్రినాథ ప్రసాద్, వి.సత్తిరాజులు నాయుడు, ఎం.సూర్యనారాయణ, ఎస్.లక్ష్మణరావు, కెఎం సంజీవరావు, రామానుజలు, జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు.

➡️