పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఎస్‌పి

May 13,2024 22:40

విజయనగరం కోట: జిల్లా ఎస్‌పి ఎం.దీపిక సోమవారం విజయనగరం నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలంచారు. అక్కడ బందోబస్తుపై ఆరా తీశారు. విటి అగ్రహారం, బిసి కాలనీ, లంకాపట్నం, దాసన్నపేట పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి ఎటువంటి అల్లర్లు జరగకుండా చూడాలని, ఓటర్లను క్యూ లైన్లలో పంపాలని, 100 మీటర్ల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు మాత్రమే ఉండాలని ఆదేశించారు. ఎస్‌పి వెంట ఎస్‌బి సిఐ కెకెవి విజయనాథ్‌, పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని గుడివాడ పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్‌ పూర్తయిన తరువాత ఇవిఎంలను సురక్షితంగా స్ట్రాంగ్‌ రూమ్‌లకు పోలీసు ఎస్కార్టుతో తీసుకెళ్లాలని సిబ్బందిని ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రాజాం నియోజకవర్గంలోని ఉణుకూరు, బొద్దాం పోలింగ్‌ కేంద్రాలను అదనపు ఎస్‌పి అస్మా ఫర్హీన్‌ పరిశీలించారు. ఏ చిన్న సంఘటన తలెత్తినా సంబంధిత రూట్‌ మొబైల్స్‌, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ లకు సమాచారం అందించాలని సూచించారు. ఆమె వెంట ట్రైనీ డిఎస్‌పి ఎస్‌.మహేంద్ర, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

➡️