టిడిపిలో చేరిన వైకాపా కార్పొరేటర్ సుమతి

Mar 6,2024 12:41 #Vizianagaram
Vaikapa corporator Sumathi joins TDP

పార్టీ కండువా వేసి ఆహ్వానించిన అశోక్ గజపతిరాజు, అదితి విజయలక్ష్మి గజపతిరాజు

ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం 8వ డివిజన్ కార్పొరేటర్ ద్వాదశి సుమతి వైకాపాను విడి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం నాడు స్థానిక అశోక్ బంగ్లా టిడిపి కార్యాలయంలో స్థానిక 8వ డివిజన్ కార్పొరేటర్ ద్వాదశి సుమతి నాయకత్వంలో డప్పులు, మందు గుండు పేల్చు కుంటూ బంగ్లాలో సంబరాలు జరుపుకున్నారు. అనంతరం టిడిపి పోలిట్బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిని పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️