కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ

ప్రజాశక్తి-రాజోలు:ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజోలు ఎస్‌ఐ జి.పృద్ద్వీ హెచ్చరించారు.గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్ర చారం, ర్యాలీలు తదితర కార్యక్రమాల కోసం సంబంధిత అధికారులను సంప్రదించి నిబంధనల ప్రకారం నిర్వహించుకోవాలని సూచించారు. అంతేకా కుండా ఇతర పార్టీల వారిని కించపరిచి వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం కూడా కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. నేరుగానైన లేదా వివిధ ప్రసార మాధ్యమాలు లేదా సామాజి క మాధ్యమాల్లో వ్యవహరించి ఎన్నికల నియమావళి ఉల్లం ఘనలకు పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా కోడ్‌ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.రూ.50 వేలకు మించి నగదును రవాణా చేయకూడదని పేర్కొన్నారు. ఎక్కువ మొత్తంలో నగదును తీసుకెళ్తే తప్పనిసరిగా రశీదులు చూపించాలన్నారు. లేదంటే డబ్బులను సీజ్‌ చేసి కోర్టుకు తరలిస్తామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు సహకరించాలని కోరారు.

➡️