విశాఖలో భారీ ప్రదర్శన

Feb 16,2024 11:18 #Visakha

ప్రజాశక్తి-విశాఖ : కేంద్ర బిజెపి-మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన అఖిల భారత శ్రామిక సమ్మె, గ్రామీణ బంధు సందర్భంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖ నగరంలో భారీ ప్రదర్శన జరిగింది. స్థానిక సరస్వతి పార్కు వద్ద నుంచి డాబా గార్డెన్స్, ఎల్ఐసి జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా, జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సాగింది. ప్రదర్శనలో పెద్ద ఎత్తున మహిళా కార్మికులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జాతీయ కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కె ఎస్ వి కుమార్, రాష్ట్ర కార్యదర్శి, జె.వి సత్యనారాయణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి ఎస్ జె అచ్యుతరావు, ఐ ఎన్ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఎం. లక్ష్మి, సి ఎఫ్ టి యు ఐ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️