షిప్‌యార్డు విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక

Jun 27,2024 00:41 #Shipyard Retired employees
Shipyard Retired Employees meet

 ప్రజాశక్తి-మాధవధార : హిందూస్తాన్‌ షిప్‌యార్డు రిటైర్డ్‌ ఉద్యోగుల ఆత్మీయకలయిక బుధవారం మాధవధారలోని మాధవస్వామి మున్సిపల్‌ కల్యాణ మండపంలో నిర్వహించారు. 30 నుంచి 40 సంవత్సరాలు షిప్‌యార్డులో వివిధ హోదాల్లో పనిచేసి విరమణ పొందిన ఉద్యోగులు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పిల్లలు, కుటుంబ సభ్యుల గురించి ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. కంపెనీలో జరిగిన పాత సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ గడిపారు. వారిలో 80 సంవత్సరాలు దాటిన 17 మందిని సత్కరించారు. భోజన విరామం తరువాత హుష్‌ కాకి అప్పారావు, మిత్రులు తమ కళా నైపుణ్యంతో ఆహ్లాదపరిచారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి 500 మందికిపైగా హాజరై జయప్రదం చేసిన వారికి, ఆర్థిక సహాయం చేసిన సభ్యులకు హిందూస్థాన్‌ షిప్‌ యార్డు రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.

➡️