ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేసిన ఎంవివి

Mar 16,2024 14:27 #Visakha

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : ప్రమాద బాధితులకు ఎల్లప్పుడూ ఏపీ సీఎంజగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శనివారం ఉదయం విశాఖ లాసన్స్ బే కాలనీలో క్యాంపు కార్యాలయంలో 10 వార్డు వివేకానందనగర్ ప్రాంతానికి చెందిన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న తాలాడ శ్రీను (28) కు ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 75 వేల ఆర్థిక సహాయం చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ పేదవర్గాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ముఖ్యమంత్రి సహాయ నిధి తోడ్పాటు అందిస్తోందని అన్నారు. ఆరోగ్యశ్రీ జాబితాలో లేని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో నాగవంశం కార్పొరేషన్ చైర్ పర్సన్ బొడ్డు అప్పలకొండమ్మ, బొడ్డు అప్పలనాయుడు, పార్టీ శ్రేణులు మహిళలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️