గంటాకు కృతజ్ఞతలు తెలిపిన పొలమరశెట్టి

Mar 20,2024 10:58 #Visakha

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : సీనియర్ నాయకుడైన పొలమరశెట్టి శ్రీనివాసరావుకు విశాఖపట్నం పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు గాను మంగళవారం సాయంత్రం ఎంవిపి కాలనీలోని గంటా శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన పదవిని పార్టీ అభివృద్ధికి తోడ్పడే విధంగా కృషి చేయాలని పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే విధంగా అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కుట్టా కార్తీక్, విశాఖ పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి సనపల వరప్రసాద్, 43వ వార్డు ప్రెసిడెంట్ బొడ్డేటి మోహన్, 48వ వార్డు ప్రెసిడెంట్ గొర్లె అప్పారావు, 49వ వార్డు సెక్రటరీ వాసు మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️