సినీ తారల సందడి

Jun 21,2024 00:17 #honeyrose, #jbrandvizag
అభిమానులకు అభివాదం చేస్తున్న హనీరోజ్‌

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ :

హీరోయిన్లు హనీ రోజ్‌, మానస చౌదరి గురువారం విశాఖలో సందడి చేశారు. బ్యూటీ సేవల్లో పేరుగాంచిన జై స్టూడియో నాలుగో బ్రాంచిని గురువారం ఉదయం సిరిపురంలోని విఐపి రోడ్డులో వీరిరువురూ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హనీ రోజ్‌ మాట్లాడుతూ ప్రఖ్యాతిగాంచిన జై స్టూడియోను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎంతో అధునా తనంగా.. అడ్వాన్స్‌ టెక్నాలజీతో కాస్మటాలజీ సేవలు ఇస్తున్నారని, కొత్త బ్రాంచి ప్రారంభ సందర్భంగా ఎన్నో ఆఫర్లు ప్రకటించారని తెలిపారు. తాను నటించిన సినిమా మలయాళం, తెలుగులో త్వరలో విడుదల కాబోతోందని, తెలుగులో కూడా చాలా అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. జై స్టూడియో మేనేజింగ్‌ పార్టనర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ తాము ఇప్పటివరకు మూడు బ్రాంచ్‌లను ఏర్పాటు చేశామని, ఇది నాలుగో బ్రాంచి అని తెలిపారు. దీనిలో కాస్మటాలజీ, బ్రైడల్‌ మేకప్‌, హెయిర్‌, ఆయుర్వేద సేవలు ఇస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో జై స్టూడియో అధినేత జ్యోతి, రవి పాల్గొన్నారు.

➡️