Waltair: వాల్తేరు డివిజన్ సరికొత్త రికార్డు

Mar 29,2024 16:55 #Visakha

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ :  వాల్తేరు డివిజన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో అపూర్వమైన విజయం సాధించింది. గత రికార్డులన్నింటినీ అధిగమించింది. మార్చి 26న 75 మిలియన్ టన్నుల సరుకు రవాణా రికార్డును అధిగమించి, ఆర్థిక సంవత్సరంలో మరో మూడు రోజులు మిగిలి ఉండగానే నిన్న 75.64 మెట్రిక్ టన్నుల సరుకు రవాణాను తాకింది. ప్రకృతి వైపరీత్యాలతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం లోడింగ్ 69.6 మెట్రిక్ టన్నుల కంటే ఈ గణనీయమైన పెరుగుదల డివిజన్ యొక్క బలమైన వృద్ధి పథాన్ని ప్రతిబింబిస్తుంది. కొత్తవలస – కిరండూల్ మార్గంలో రికార్డు స్థాయిలో 22.88 మిలియన్ టన్నులు, ప్రధానంగా ఇనుప ఖనిజం లోడ్ చేయబడింది, ఇది గత సంవత్సరం కంటే 22.4% ఎక్కువ. వైజాగ్ పోర్టులో 20.66 మెట్రిక్ టన్నులు, అదానీ గంగవరం పోర్టులో 17.75 మెట్రిక్ టన్నులు లోడ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 4.19 మిలియన్ టన్నులను అందించింది. కమోడిటీల వారీగా చూస్తే కోల్ అండ్ కోక్ 25.29 మెట్రిక్ టన్నులు, ఐరన్ ఓర్ 22.53 మిలియన్ టన్నులు, బాక్సైట్ 5.52 మిలియన్ టన్నులు, అల్యూమినా 3.77 మెట్రిక్ టన్నులు, ఐరన్ అండ్ స్టీల్ 3.02 మెట్రిక్ టన్నులు, స్లాగ్, కాస్టిక్ సోడా, జిప్సం, కంటైనర్ ట్రాఫిక్ 23.7 శాతం పెరిగాయి. ఈ సందర్భంగా గా డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ మాట్లాడుతూ, “టీమ్ వాల్తేరు సాధించిన ఈ విజయాలు వాల్తేర్ డివిజన్ కు ఒక చారిత్రాత్మక మైలురాయని సమన్వయ ప్రయత్నాలు, వ్యూహాత్మక ప్రణాళిక, కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం, సరుకు రవాణా వినియోగదారులతో సన్నిహిత సహకారం ద్వారా తాము కొత్త రికార్డులను నెలకొల్పడానికి సహాయపడ్డాయని ఆయన అన్నారు.

➡️