మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే

Apr 19,2024 22:15

ప్రజాశక్తి-భోగాపురం : రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసిపి ప్రభుత్వమేనని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేశారు. మండలంలో నంది గాం పంచాయతీలో శుక్రవారం వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, సర్పంచ్‌ గరే మురళి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గతసారి మంచి మెజార్టీతో గెలిపించారని, అందుకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. మూడోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఎన్‌ఆర్‌ఐలను నమ్మి ఓటు వేయొద్దని కోరారు. కార్యక్రమంలో నాయకులు పదాల శ్రీనివాసరావు, భాను, కందుల రఘుబాబు, ఉప్పాడ శివారెడ్డి, రమేష్‌రాజు, బైరెడ్డి యర్రప్పలనారాయణ, బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కొల్లి రామ్మూర్తి, కర్రోతు వెంకటరమణ, గరే సంజీబు పాల్గొన్నారు.పినతాడివాడలో వైసిపి ప్రచారండెంకాడ: మండలంలోని పినతాడివాడలో వైసిపి నాయకులు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి బంటుపల్లి వెంకటవాసుదేవరావు, ఎమ్మెల్యే కుమారుడు ప్రదీప్‌ నాయుడు, మణిదీప్‌ నాయుడులు పాల్గొని ఇంటింటికీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును గెలిపించుకోవాలన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి ఆమె భర్త ప్రసాద్‌ మిరాకిల్‌ సంస్థ కోసం పేదల భూములను కొట్టేసారని ఆరోపించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా బడ్డుకొండ అప్పలనాయుడును, ఎమ్‌పిగా బెల్లాన చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పినతాడివాడ సర్పంచ్‌ లంక లక్ష్మణరావు, ఎంపిటిసి విజినగిరి అచ్చం నాయుడు, మాజీ సర్పంచ్‌ వాళ్ళ వెంకట్రావు, వైస్‌ సర్పంచ్‌ రేవల్ల అప్పలనాయుడు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకుతు పాల్గొన్నారు.

వైసిపిలో చేరికలు రామభద్రపురం: రామభద్రపురం మండల కేంద్రంలో గూడెపువీధికి చెందిన 50 కుటుంబాలు వైసిపిలో చేరాయి. శుక్రవారం స్థానిక వైసిపి కార్యాలయంలో సీనియర్‌ నాయకుడు కనిమెరక అప్పారావు ఆధ్వర్యాన వారంతా ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు సమక్షంలో వైసిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో విశాఖ డెయిరీ అధ్యక్షులు రామకృష్ణ, జెసిఎస్‌ కన్వీనర్‌ సింహాచలం నాయుడు, పాల్గొన్నారు.

➡️