భూమి కోసం పోరాటం చేయాల్సిందే

ప్రజాశక్తి-అట్లూరు దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా కోట్లాదిమంది పేదలకు నేటికీ జానెడు భూమి లేదని ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప పేదల వారి బతుకులు మారడం లేదని, భూమి కోసం పోరాటం చేయాల్సిన అవసరమెంతైనా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి. అన్వేష్‌, జి. శివకుమార్‌, ఉపాధ్యక్షులు వెంకటేష్‌ అన్నారు. ఆదివారం రమణయ్య అధ్యక్షతన వ్యవసాయ కార్మిక సంఘం మండల 3వ మహాసభలు అట్లూరు క్రాస్‌ రోడ్డులో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి యత్నిస్తున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఉపాధి పనులు నిధులు తగ్గించిందని వాపోయారు. సమ్మర్‌ అలవెన్స్‌, మజ్జిగ, మంచినీరు, గడ్డపార, ఆటో ఛార్జీలు చాలా వరకూ తగ్గించిందన్నారు. రూ.30 కూలి పెంచి రూ.80 కోత విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరి సమ్మర్‌ అలవెన్స్‌ మంజూరు చేయాలని వారు డిమాండ్‌ చేశారు, ప్రతి ఏడాదీ వర్షాలు తగ్గుతున్నాయని వ్యవసాయ రంగంలో యంత్రాలు పెరిగాయని అందువల్ల పనులు తగ్గుతున్నాయన్నారు. ఉపాధి పనులు 200రోజులకు పెంచి ప్రతి కూలీకి రూ. 600 కూలి ఇవ్వాలన్నారు. ఇంటి స్థలం, వ్యవసాభూమిలేని పేదలు కోట్లలో ఉన్నారని, వారి భూమి అందని ద్రాక్షలగానే మిగిలిపోయిందని పేర్కొన్నారు. అసైన్‌మెంట్‌ కమిటీలు అలంకార ప్రాయంగా ఉన్నాయని తెలిపారు. 17సంవత్సరాలుగా అసైన్డ్‌ మెంట్‌ కమిటీ నిర్వహించి పేదలకు భూములు పెంచలేదని వారు వాపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులు, లేక భూములు లేక యువకులు పట్టణాలకు, ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారని తెలిపారు. పీజీ, బిటెక్‌, ఎంటెక్‌ లాంటి ఉన్నత చదువులు చదివి సరైన ఉపాది అవకాశాలు లేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం భూమిలేని వారికి స్థలాలు ఇవ్వాలని, ఉపాధి చట్టానికి నిధులు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, పుల్లయ్య, దుర్గమ్మ, నాగేంద్ర, షరీఫ్‌, రామ్మోహన్‌,అరవింద్‌, చంద్ర, లత, గుర్రమ్మ, మరియమ్మ స్వప్న, శ్రీను, మాధవి, అశోక్‌, సుభద్ర పాల్గొన్నారు.వి. అన్వేష్‌, జి. శివకుమార్‌, ఉపాధ్యక్షులు వెంకటేష్‌ అన్నారు. ఆదివారం రమణయ్య అధ్యక్షతన వ్యవసాయ కార్మిక సంఘం మండల 3వ మహాసభలు అట్లూరు క్రాస్‌ రోడ్డులో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి యత్నిస్తున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఉపాధి పనులు నిధులు తగ్గించిందని వాపోయారు. సమ్మర్‌ అలవెన్స్‌, మజ్జిగ, మంచినీరు, గడ్డపార, ఆటో ఛార్జీలు చాలా వరకూ తగ్గించిందన్నారు. రూ.30 కూలి పెంచి రూ.80 కోత విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరి సమ్మర్‌ అలవెన్స్‌ మంజూరు చేయాలని వారు డిమాండ్‌ చేశారు, ప్రతి ఏడాదీ వర్షాలు తగ్గుతున్నాయని వ్యవసాయ రంగంలో యంత్రాలు పెరిగాయని అందువల్ల పనులు తగ్గుతున్నాయన్నారు. ఉపాధి పనులు 200 రోజులకు పెంచి ప్రతి కూలీకి రూ. 600 కూలి ఇవ్వాల న్నారు. ఇంటి స్థలం, వ్యవసాభూమిలేని పేదలు కోట్లలో ఉన్నారని, వారి భూమి అందని ద్రాక్షలగానే మిగిలి పోయిందని పేర్కొన్నారు. అసైన్‌మెంట్‌ కమిటీలు అలంకార ప్రాయంగా ఉన్నాయని తెలిపారు. 17సంవత్సరాలుగా అసైన్డ్‌ మెంట్‌ కమిటీ నిర్వహించి పేదలకు భూములు పెంచలేదని వారు వాపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులు, లేక భూములు లేక యువకులు పట్టణాలకు, ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారని తెలిపారు. పీజీ, బిటెక్‌, ఎంటెక్‌ లాంటి ఉన్నత చదువులు చదివి సరైన ఉపాది అవకాశాలు లేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం భూమిలేని వారికి స్థలాలు ఇవ్వాలని, ఉపాధి చట్టానికి నిధులు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, పుల్లయ్య, దుర్గమ్మ, నాగేంద్ర, షరీఫ్‌, రామ్మోహన్‌, అరవింద్‌, చంద్ర, లత, గుర్రమ్మ, మరియమ్మ స్వప్న, శ్రీను, మాధవి, అశోక్‌, సుభద్ర పాల్గొన్నారు.

➡️