వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేయబోం..

Apr 5,2024 22:34
ఫొటో : మాట్లాడుతున్న ఆనం రామనారాయణరెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ఆనం రామనారాయణరెడ్డి
వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేయబోం..
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : రాష్ట్రంలో తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు ఎన్నికై ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వలంటీర్లను ప్రభుత్వంలో భాగస్వాములుగా చేస్తామని ఉమ్మడి ఎంఎల్‌ఎ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని రవితేజ కళ్యాణ మండపంలో జనసేన నియోజకవర్గం ఇన్‌ఛార్జి నలిశెట్టి శ్రీధర్‌ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఉమ్మడి కూటమే ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వలంటీర్‌ వ్యవస్థను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. ఇప్పటి వైసిపి ప్రభుత్వం జగన్మోహన్‌ రెడ్డి లాగా కూలీలు కన్నా హీనంగా చూశారని, తాము ఆవిధంగా చూడమని, వలంటీర్లను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామన్నారు. దేశంలో భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లు అందరూ కలిసి అందరి కలయికతో అక్రమ అరాచక పరిపాలనను పారద్రోలడానికి ఎన్నికలు ఉమ్మడిగా ఏర్పాటు చేశామన్నారు. జగన్మోహన్‌ రెడ్డి అప్రజాస్వామికంగా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పరిపాలనను ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆనం రంగమయూర్‌ రెడ్డి, పరిశీలకులు బుల్లెట్‌ రమణ, టిడిపి నాయకులు తుమ్మల చంద్రారెడ్డి, చల్లా రవికుమార్‌ రెడ్డి, బుజ్జిరెడ్డి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️