అంగజాలపాలెంలో చెడుగుడు పోటీలు

ప్రజాశక్తి – మొగల్తూరు

మండలంలోని పేరుపాలెం నార్త్‌ పంచాయతీ పరిధి అంగజాలపాలెంలో అంతర్‌ జిల్లాల చెడుగుడు పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని గ్రామంలోని రామాలయం వద్ద చెడుగుడు పోటీలు నిర్వహించారు. సోమవారం జరిగిన పోటీల్లో పాలకొల్లు జట్టుపై భీమవరం జట్టు ఈగల్‌ బార్సు విజయం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకూ పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.

➡️