హామీల అమలు ఘనత జగన్‌దే

ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు
ప్రజాశక్తి – ముసునూరు
మండలంలోని ముసునూరు హైస్కూల్‌లో ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలు అమలు చేసిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందన్నారు. మాజీ సిఎం చంద్రబాబు గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు డాక్టర్‌ ప్రతాప్‌, ఎంపిపి కొండా దుర్గాభవాని వెంకట్రావ్‌, వైస్‌ ఎంపిపి కోటగిరి రాజానాయన, సర్పంచులు పేరం కృష్ణ, నక్కనబోయిన సత్యనారాయణ, రాజబోయిన శ్రీదేవి శ్రీనివాసరావు, రంగు ధనలక్ష్మి గాంధీ, పుట్లా మోహనరావు, వైసిపి మండలాధ్యక్షులు ఎం.నాగవల్లేశ్వరరావు, సోషల్‌ మీడియా మండల కన్వీనర్‌ కంభాల దాసు, ఎంపిడిఒ జి.రాణి, తహాశీల్దార్‌ సుధ పాల్గొన్నారు.

➡️