ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల వంటావార్పూ

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె గురువారానికి తొమ్మిదో రోజుకు చేరింది. భీమవరంలోని విస్సాకోడేరు వంతెన వద్ద ఏర్పాటుచేసిన నిరసనలో భాగంగా గురువారం వంటావార్పు చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు పాల్గొని వారి సమ్మెకు మద్దతు తెలిపి రూ.30.000 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా గోపీమూర్తి మాట్లాడుతూ విద్యావ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటికైనా యూనియన్‌తో చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు కె.రాజారామ్మోహన్‌ రారు, జెఎసి అధ్యక్షులు భావాజీ, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు విజయరామరాజు, యుటిఎఫ్‌ జిల్లా సభ్యులు రామకృష్ణ, రమేష్‌ పాల్గొన్నారు.

➡️