ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

భీమవరం రూరల్‌ : సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘం జెఎసి జిల్లా అధ్యక్షులు షేక్‌ బావాజీ ప్రభుత్వాన్ని కోరారు. సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న వివిధ శాఖల కాంటాక్టు ఉద్యోగులు తమను రెగ్యులర్‌ చేయాలని హెచ్‌ఆర్‌, డిఎ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సమ్మె బుధవారానికి ఎనిమిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా బావాజీ మాట్లాడుతూ ఏళ్ల తరబడి చేస్తున్నప్పటికీ తమకు ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. విద్యావవస్థలో ఎన్నో కీలకమైన పనులు ప్రభుత్వం తమ చేత చేయిస్తోందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెసెంజర్‌ జనార్దన్‌, అకౌంటెంట్‌ కిరోషా, ఇంజినీర్‌ వెంకటేశ్వరరావు, డేటా ఎంట్రీ మోహన్‌, పిఇటి శ్రీను, మెసెంజర్‌ బాబు, మధు పాల్గొన్నారు.

➡️