కంచాలతో మోత మోగించారు..

ప్రజాశక్తి – వీరవాసరం

హామీలు అమలు చేయాలని కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారానికి 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కంచాలతో శబ్ధం చేసి నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాయలం వరకూ ర్యాలీ వెళ్లి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్షురాలు నాగరత్నం, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.ఆచంట: ఆచంట కచేరీ సెంటర్లో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు కంచాల మోగిస్తూ నిరసన తెలిపారు. సమ్మెకు సిపిఎం మాజీ మండల కార్యదర్శి తలుపూరి బుల్లబ్బాయి సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు, అంగన్‌వాడీలు మైలే విజయలక్ష్మి, గుత్తుల శ్రీదేవి, మహేశ్వరి, కమల, సత్యవతి పాల్గొన్నారు.అంగన్‌వాడీ కార్మికుల సమ్మె విచ్ఛన్నకర చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వీడనాడాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ సభ్యులు జయప్రద అన్నారు. ఆచంట కచేరీ సెంటర్లో అంగన్‌వాడీల సమ్మెకు యుటిఎఫ్‌ నాయకులు సంఘీభావం తెలిపారు. సమ్మెకు యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు మార్కండేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎకెవి.రామభద్రం, జిల్లా కార్యదర్శి కాంతికుమార్‌, ఎం.శ్రీనుబాబు, యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు కేతా వెంకటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథం, శ్రీనివాస్‌ మద్దతు తెలిపారు.ఆచంట(పెనుమంట్ర) : అంగన్‌వాడీల సమ్మె 15వ రోజుకు చేరింది. సిఐటియు మండల కార్యదర్శి కోడే శ్రీనివాస ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగే సమ్మెకు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మద్దతు తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కూసంపూడి సుబ్బరాజు, అంగన్‌వాడీ సెక్టార్‌ లెటర్స్‌ సాయి మహాలక్ష్మి, మౌనిక, సరస్వతి, టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.ఉండి : రాష్ట్రంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాదని రాజ్యాంగాన్ని అమలు చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి అన్నారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన అంగన్‌వాడీల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ ఆశయ సాధనకు యుటిఎఫ్‌ కట్టుబడి ఉందన్నారు. అనంతరం అంగన్‌వాడీలు కంచాలు గరిటెలతో శబ్ధం చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు విజయరామరాజు, ఉపాధ్యాయులు పి.డేవిడ్‌రాజు, సిఐటియు మండల అధ్యక్షులు డి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.మొగల్తూరు : అంగన్‌వాడీల న్యాయ పోరాటానికి తాము అండగా ఉంటామని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామభద్రం అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు చేపట్టిన దీక్ష కొనసాగింది. కార్యక్రమంలో జిల్లా నాయకులు క్రాంతి కుమార్‌, పి.కృష్ణకుమారి, మండల నాయకులు చింతపల్లి కృష్ణమోహన్‌, సిహెచ్‌.శ్రీనివాస్‌, బ్రహ్మయ్య, ధర్మారావు, జానీ పాల్గొన్నారు. అలాగే అంగన్వాడీల దీక్షా శిబిరాన్ని ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాయకురాలు ఐలూరి సవిత, సిపిఎం నాయకులు కొత్త విజయకుమార్‌ పాల్గొన్నారు.పెంటపాడు : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా ఆవా వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు వై.జయంతి, ఎం.సీత, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, సిపిఎం మండల కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎ.ఆదిలక్ష్మి, బి.మనీ, పి.ఉష, వి.నాగమణి, వై.పార్వతి, పెనగంటి దుర్గ పాల్గొన్నారు.పెనుగొండ : అంగన్‌వాడీల సమ్మెకు ఆశా వర్కర్లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాలు కె.తులసి మాట్లాడారు. ఆశా వర్కర్లు లక్ష్మీదుర్గ, లక్ష్మీకుమారి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్‌.వెంకటేశ్వరరావు, మాదాసు నాగేశ్వ రరావు, ఎన్‌.ఆదినారాయణ, ఆర్‌.వెంకటేష్‌ పాల్గొన్నారు.భీమవరం రూరల్‌ : పట్టణంలో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మెకు టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్‌ సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో టిిడిపి పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావు, టిడిపి మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ శిబిరాలను యుటిఎఫ్‌ నేతలు సందర్శించి సమ్మెకు యుటిఎఫ్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి మాట్లాడారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఎస్‌.విజయరామరాజు, ఎకెవి.రామభద్రం, జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.మార్కండేయులు, జిల్లా కోశాధికారి సిహెచ్‌.పట్టాభి రామయ్య పాల్గొన్నారు. పోడూరు : అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరింది. ఈ మేరకు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట కంచాలతో శద్ధం చేస్తూ నిరసన తెలిపారు. సమ్మెకు ఆశా వర్కర్లు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కౌన్సిల్‌ సభ్యులు పిల్లి.ప్రసాద్‌, ప్రాజెక్ట్‌ లీడర్‌ పీతల రాజమణి, జె.ఉమాదేవి, రాయుడు కుమారి, బూరాబత్తుల వెంకట్రావు పాల్గొన్నారు. అంగన్‌వాడీలు, ఆశాల సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు డి.జ్యోతి డిమాండ్‌ చేశారు. ముందుగా అంగన్‌వాడీ శిబిరం నుంచి ప్రదర్శనగా వెళ్లి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిటి రాజేష్‌కు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. మండల కార్యదర్శి పిల్లి సాయిలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్లె శ్రీదేవి, ప్రాజెక్ట్‌ నాయకులు పి.రాజామణి, సెక్టర్‌ నాయకులు ఆర్‌.కుమారి, జె.ఉమాదేవి, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.తాడేపల్లిగూడెం : సమస్యల పరిష్కారం కోరుతూ కంచాలు, గిన్నెలతో అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మె 15వ రోజు కొనసాగింది. సమ్మెకు యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి పి.శివప్రసాద్‌ సంఘీభావం తెలిపి మాట్లాడారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షరాలు స్వరూపరాణి మాట్లాడారు. అనంతరం కంచాలతో శబ్ధాలు చేసి నిరసన తెలిపారు. సమ్మెకు సిఐటియు నాయకులు వై.వెంకన్న, ఆశా కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.తణుకు రూరల్‌ : అంగన్‌వాడీల చిన్నపాటి సమస్యలు పరిష్కారం చేయనప్పుడు జగన్మోహన్‌ రెడ్డికి అధికారం ఎందుకని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ విమర్శించారు. కోర్టు వద్ద చేపట్టిన సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బళ్ల చిన వీరభద్రం, నర్సింహారావు, సిఐటియు నాయకులు గార రంగారావు, సామాజిక న్యాయ పోరాట సమితి మాజీ అధ్యక్షులు పి.మురళీ కృష్ణ, ఆండ్ర మాల్యాద్రి, వసంతకుమారి, జి.కనకదుర్గ, ప్రమీల, మణి మాలతి, మధుషీల, జ్యోతి, రాజకుమారి పాల్గొన్నారు.పాలకొల్లు : పట్టణంలో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగింది. ఈ మేరకు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద కంచాలతో శబ్ధం చేస్తూ నిరసన తెలిపారు. శిబిరానికి యుటిఎఫ్‌ పట్టణ అధ్యక్షులు వై.ప్రభాకర్‌శాస్త్రి ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. అలాగే అంబేద్కర్‌ సాహితీ వేదిక అధ్యక్షులు కెసిహెచ్‌ పెద్దిరాజు బృందం వచ్చి అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలిపారు. మొగల్తూరు : అంగన్‌వాడీల ఆకలి కేకలను రహదారులపైకి తీసుకొచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు రహదారిపై మోకాళ్లపై నిల్చుని కంచాలతో శబ్ధం చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు పెద్దింట్లు, సారమ్మ, సీత, రేఖ శాంభవి, నాగలక్ష్మి పాల్గొన్నారు.ఆకివీడు : ముఖ్యమంత్రి ఇకనైనా అంగన్‌వాడీలను చర్చకు పిలవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు పట్టణ కార్యదర్శి కె.నాయుడు హెచ్చరించారు. శిబిరం వద్ద అంగన్‌వాడీలు కంచాల మోగించి నిరసన తెలిపారు. ఈ దీక్షలకు యుటిఎఫ్‌ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి మాట్లాడారు. సమ్మెకు మద్దతు ఉంటుందన్నారు. జిల్లా కార్యదర్శి విజయరామరాజు, మండల కార్యదర్శి అద్దేపల్లి రాంబాబు పాల్గొన్నారు. అలాగే సమ్మెకు ఆశాలు సంఘీభావం తెలిపారు. తహశీల్దార్‌ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తోట పద్మ, వైకుంఠ రామలక్ష్మి, నారం నాగలక్ష్మి, కొట్టు యామినీదేవి, గోడు రమ్య, యమున, కౌతు భవాని, కత్తుల భవాని పాల్గొన్నారు.కాళ్ల : రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపలేని పక్షంలో అంగన్‌వాడీలకు మద్దతుగా ప్రత్యక్ష ఆందోళనకు యుటిఎఫ్‌ పిలుపునిస్తోందని రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి హెచ్చరించారు. కాళ్లలో అంగన్‌వాడీల సమ్మెకు యుటిఎఫ్‌ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా షేక్‌ సాబ్జీకి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిఎస్‌. విజయరామరాజు, కార్యదర్శి ప్రసాద్‌, మండల అధ్యక్షులు బిఆర్‌ఎంకె.స్వామి, ప్రధాన కార్యదర్శి ఎం.శంకర్రావు, సిఐటియు మండల అధ్యక్షులు గొర్ల రామకృష్ణ పాల్గొన్నారు.గణపవరం : సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు కంచాలు శబ్ధం చేస్తూ నిరసన తెలిపారు. సమ్మెకు యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి గోపీమూర్తి, జిల్లా అధ్యక్షులు విజయరామరాజు, మండల అధ్యక్ష కార్యదర్శులు జె.నాని, జి.భవానీప్రసాద్‌ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కాటుక ఝాన్సీలక్ష్మి, నాయకులు బి.రామకోటి, బండారు మహాలక్ష్మి, ధనలక్ష్మి, కళ్యాణి, జయలక్ష్మి పాల్గొన్నారు.యలమంచిలి : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మెకు రోజురోజుకూ పలు సంఘాల మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఖాళీ కంచాలను వాయిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సమ్మెకు ఐద్వా, యుటిఎఫ్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జయప్రభ, రామభద్రం, మార్కండేయులు, క్రాంతి కుమార్‌, శైలజ, జార్జి, సిపిఎం మండల కార్యదర్శి కానేటి బాలరాజు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు రజిని, పద్మశ్రీ, దేవి పాల్గొన్నారు.అత్తిలి : అంగన్‌వాడీల సమ్మె కొనసాగింది. సమ్మెకు యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి గోపీమూర్తి, జిల్లా అధ్యక్షులు విజయరామరాజు, జిల్లా కార్యదర్శి రామకృష ్ణప్రసాద్‌, మండల అధ్యక్షులు స్వామి, ప్రధాన కార్యదర్శి అప్పల రాజు, యుటిఎఫ్‌ మండల కేడర్‌ సంఘీభావం తెలిపారు.నరసాపురం టౌన్‌ : అంగన్‌వాడీల సమ్మె 15వ రోజుకు చేరింది. అంబేద్కర్‌ సెంటర్లో చేపట్టిన సమ్మెకు యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎకెవి.రామభద్రం, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొమ్మిడి నాయకర్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కవురు పెద్దిరాజు సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి పొన్నాడ రాము, యుటిఎఫ్‌ నాయకులు పి.కృష్ణకుమారి, పి.క్రాంతి, రాజేశ్వరి, ఎం.మార్కండేయులు, ఎన్‌వి. సత్యనారా యణ పాల్గొన్నారు. అలాగే మల్లవరంలంక అంగన్‌వాడీ కేంద్రం వద్ద కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో సమ్మెకు మద్దతుగా స్థానికులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కౌలురైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం.రామాంజనేయులు మాట్లాడారు. కార్యక్రమంలో దిడ్ల బేబి, కె.భవాని, కె.సత్యభామ, కె.సుజాత, డి.శౌదామణి పాల్గొన్నారు.

➡️