కల్లు గీత కార్మికుల సంక్షేమానికి హామీ ఇవ్వాలి

Dec 26,2023 21:24

మారియ్య వర్థంతి సభలో సంఘం జిల్లా అధ్యక్షులు మునిస్వామి
ప్రజాశక్తి – వీరవాసరం
కల్లు గీత వృత్తి పట్ల ప్రభుత్వ వైఖరి చెప్పాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామన మునిస్వామి డిమాండ్‌ చేశారు. మండలంలోని బుదారా యుడు చెరువు వద్ద గీత కార్మిక సంఘం ఉద్యమ నాయకు లు, సిపిఎం నాయకుడు జుత్తిగ మారియ్య 17వ వర్థంతి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో గీత కార్మిక వృత్తిని రక్షించుకోవడానికి ఎస్‌ఆర్‌ దాట్ల అనుసరుడిగా మారియ్య అనేక పోరాటాలు చేశారన్నారు. జైలు జీవితాన్ని అనుభవించి గీత వృత్తికి, గీత కార్మికుల జీవన విధానం మెరుగు పరచడానికి కృషి చేసిన ఉద్యమ నిర్మాత మారియ్య అని కొనియాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ గీత కార్మికులు అనేక పోరాటాల ద్వారా జిఒలు సాధించుకున్నారన్నారు. వాటిని అమలు చేయించుకోవడానికి కార్మికులు మళ్లీ ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గీత కార్మికుల రక్షణకు, సంక్షేమానికి ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కడలి పాండు, పాల అంజయ్య, కిలాడి సత్యనారాయణ, కడలి వేరంశెట్టి వీరన్న శెట్టి, బుర్ర అలమ మహారాజు, వేల బండి నారాయణమూర్తి, తాలూరి రాము, వీరవల్లి రాఘవులు, పాల శ్రీనివాస్‌, బొబ్బన్నపల్లి సూర్యచంద్రరావు పాల్గొన్నారు.

➡️