చంద్రబాబు వేషధారణలో ప్రచారం

ప్రజాశక్తి – ఆచంట

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేషధారణలో ఆచంట చిన్నపేటకు చెందిన అండ్రు లక్ష్మణరావు సైకిల్‌పై టిడిపి జెండాలు కట్టుకుని వెనకవైపు టిడిపి మేనిఫెస్టో ఫ్లెక్సీ ని ఏర్పాటు చేసుకుని ఊరంతా తిరుగుతూ విక్టరీ సింబల్‌ చూపిస్తూ ప్రచారం చేపట్టారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ టిడిపి హామీ ఇస్తున్న పథకాలు సైకిల్‌పై ప్రచారం చేపట్టినట్లు ఆయన తెలిపారు.

➡️