తోలేరులో నాటిక పోటీలు ప్రారంభం

ప్రజాశక్తి – వీరవాసరం

ఇప్పటికే నాటికలను ప్రేక్షకులు ఆదరించడం వల్లే కళాపరిషత్‌లు కొనసాగుతున్నాయని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ గంటా పద్మశ్రీ ప్రసాద్‌ అన్నారు. తోలేరులో సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్‌ నాటికల పోటీలు మంగళవారం రాత్రి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ప్రారంభించారు. దాయన సురేష్‌ చంద్రాజీ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభలో పలువురు వక్తలు మాట్లాడారు. సినీ నటులు ఆర్‌.నారాయణమూర్తి, రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ వంటి కళాకారుల సన్మాన కార్యక్రమంలో వేదికను పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం ఆర్‌. నారాయణమూర్తిని, గుమ్మడి గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాపరిషత్‌ అధ్యక్షుడు చవాకుల సత్యనారాయణమూర్తి, రిటైర్డ్‌ జడ్జి బొక్కా సత్యనారాయణ, బుద్దాల వెంకట రామారావు, రాయప్రోలు భగవాన్‌, గుండా రామకృష్ణ, కొప్పిశెట్టి గోపాలకృష్ణ, ఆదిత్య కృష్ణంరాజు, గూడూరి ఉమాబాల, తాళాబత్తుల మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

➡️