దళితపేటకు శ్మశానవాటిక కేటాయించాలి

ప్రజాశక్తి – గణపవరం

అర్థవరం దళితపేటకు ప్రభుత్వం తక్షణం శ్మశానవాటిక కేటాయించాలని కెవిపిఎస్‌ మండల కార్యదర్శి చిన్నం చిన నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అర్ధవరం దళితపేటలో జరిగిన సివిల్‌ రైట్స్‌ కార్యక్రమంలో పాల్గొన్న నాగేశ్వరరావు మాట్లాడుతూ 1235 జిఒ ప్రకారం దళితులకు శ్మశానవాటిక కేటాయించాలన్నారు. దళితులు సమావేశాలు నిర్వహించడానికి కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ వెంకటేశ్వరరావు, ఎంపిటిసి సుభాష్‌, గ్రామాభివృద్ధి కమిటీ నాయకులు పాల్గొన్నారు.

➡️