దాతల సాయం..పాఠశాల ప్రగతి పథం

Jan 11,2024 21:01

కోపల్లె హైస్కూల్లో రూ.19 లక్షలతో సౌకర్యాల కల్పన
అండగా నిలుస్తున్న పూర్వ విద్యార్థులు
ప్రజాశక్తి – కాళ్ల
విద్యార్థుల భవిష్యత్‌ తరగతి గదిలో రూపు దిద్దుకుంటుంది. నేటి బాలలే రేపటి భావిపౌరులుగా తీర్చిదిద్దేది పాఠశాలల్లోనే. అందుకే గుడికి చేసే ఉపకారం కంటే బడికి చేసే సాయం ఎక్కువ అంటారు. అటువంటి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు ఉపయోగపడే పనుల కోసం దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. కొందరు దాతలు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తాము సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పాఠశాలలకు విరాళంగా అందించి పాఠశాల, విద్యాభివృద్ధికి సహకరిస్తున్నారు.కాళ్ల మండలంలోని కోపల్లె గ్రామంలో శ్రీమంతెన దుర్గరాజు రాజయ్యమ్మ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు, గ్రామానికి చెందిన దాతలు, పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయులు కొంత డబ్బును విరాళంగా అందించి సైకిల్‌ షెడ్డు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌, సిమెంట్‌ రోడ్డు నిర్మాణం, కళావేదిక, గార్డెన్‌ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నెల 12వ తేదీన రూ.19 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. రూ.19 లక్షలతో అభివద్ధికోపల్లె ఉన్నత పాఠశాలకు దాతలు రూ.16 లక్షలు విరాళంగా అందించారు. మండల పరిషత్‌ నిధులు రూ.3 లక్షలు మొత్తం రూ.19 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. సైకిల్‌ షెడ్డు నిర్మాణంజక్కరం గ్రామానికి చెందిన సాగిరాజు అప్పలరాజు (సింగపూర్‌ అప్పన్న) రూ.5.51 లక్షలు ఆర్థిక సాయం అందించడంతో సైకిల్‌ షెడ్డును నిర్మించారు. బాలికల సైకిల్‌ షెడ్డుగా ఉపయోగించనున్నారు. సైకిల్‌ షెడ్డు నిర్మాణంలో సాగిరాజు అప్పలరాజు ముఖ్యపాత్ర వహించటం హర్షణీయం.మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌హైస్కూల్‌లో ఆర్‌ఒ ప్లాంట్‌ నిర్మాణానికి దాతలను సమీకరించడంలో ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు ముందుకువచ్చారు. విర్బాక్‌ కంపెనీ ఆధ్వర్యంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను రూ.3.50 లక్షలతో ఎంఎల్‌ఎ రామరాజు ప్రోత్సాహంతో ఏర్పాటు చేశారు. సిమెంట్‌ రోడ్డు నిర్మాణంఎంపిపి పెన్మెత్స శిరీష విశ్వనాథరాజు కృషితో మండల పరిషత్తు నిధులు రూ.3 లక్షలు మంజూరయ్యాయి. హైస్కూల్‌కి వచ్చే ప్రధాన రహదారిలో సిమెంట్‌ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కళావేదికఉండి మాజీ ఎంఎల్‌ఎ పాతపాటి సర్రాజు జ్ఞాపకార్థంగా వారి కుమారులు పాతపాటి వెంకట శ్రీనివాసరాజు(వాసు), పాతపాటి యుగంధర్‌వర్మ కళావేదికను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సుమారు రూ.6 లక్షలతో నిర్మిస్తున్నారు.గార్డెన్‌స్కూల్‌ ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. చుట్టూ పచ్చని చెట్లు, వివిధ రకాల మొక్కలు పరిశుభ్రమైన ఆవరణతో బడి ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా అనిపిస్తున్నది. గార్డెన్‌ ఏర్పాటుకు వేంపాడు గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ వేగేశ్న సత్యనారాయణరాజు (విఎస్‌ఎన్‌.రాజు) రూ.లక్ష ఆర్థిక సహకారం అందించారు. రూ.1.50 కోట్లతో పాఠశాల అభివృద్ధికొత్తపల్లి బంగార్రాజు, పూర్వ విద్యార్థి, జక్కరంకోపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పూర్వ విద్యార్థుల విరాళాలు రూ.1.50 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాం. విఎస్‌ఎన్‌.రాజు సూచనలు, సలహాల మేరకు ఎన్‌ఆర్‌ఐలు, పూర్వ విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించి పాఠశాలను సుందరంగా నిర్మించనున్నాం. పాఠశాల చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌, ఆటలకు సంబంధించిన కోర్టులు కొత్తగా నిర్మించనున్నాం. గ్రౌండ్‌ లెవెలింగ్‌ చేయనున్నాం. చెరువు చుట్టూ రిటర్నింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. పాఠశాలలో పలు అభివృద్ధి పనులు చేయడానికి సూచనలు, సలహాలు తీసుకుంటున్నాం. ఛైర్మన్‌గా డాక్టర్‌ వేగశ్న రామకృష్ణంరాజు, సెక్రటరీగా కొత్తపల్లి బంగార్రాజు, పాఠశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ మంతెన రామ్‌కుమార్‌రాజు, ట్రెజరర్‌గా వేగశ్న రామరాజు వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్‌ స్థాయిలో పాఠశాలను తీర్చిదిద్దుతాంరామ్‌కుమార్‌రాజు, హైస్కూల్‌ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌పాఠశాలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్‌ స్థాయిలో పోటీ పడే విధంగా ఉండాలి. పూర్వ విద్యార్థుల సహకారంతో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశాం.

➡️