పోలింగ్‌ బూత్‌ల పరిశీలన

ప్రజాశక్తి – ఆచంట ( పెనుమంట్ర)
మండలంలోని పోలింగ్‌ బూత్‌లను ఆదివారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బి.స్వామినాయుడు పరిశీలించారు. పోలింగ్‌ బూత్‌ల సౌకర్యం ఎలా ఉన్నాయో బిఎల్‌ఒలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ నమోదు పరిశీలించారు. మార్టేరు, నెగ్గిపూడి, వెలగలేరు, బ్రాహ్మణచెరువు, పెనుమంట్ర, వెలగలవారిపాలెం, భట్లమాగుటూరు, ఆలమూరుతో పాటు పలు గ్రామాల్లో పోలింగ్‌ బూత్‌లను ఆయన పరిశీలించారు. వీరితోపాటు తహశీల్దార్‌ దండు అశోక్‌వర్మ, ఎంపిడిఒ పి.పద్మజ పాల్గొన్నారు.

➡️