ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌

సర్పంచి భూపతిరాజు వెంకట జగ్గరాజు

ప్రజాశక్తి – కాళ్ల

పల్లె ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని గ్రామ సర్పంచి భూపతిరాజు వెంకట జగ్గరాజు అన్నారు. ఏలూరుపాడులో పైపులైను పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. 1980లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో వేసిన పైపులైన్లు శిథిలావస్థకు చేరాయి. శివారు ప్రాంతాలకు కుళాయి నీరు పూర్తిస్థాయిలో రావడం లేదు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు తాగునీరందించేందుకు కార్యాచరణ రూపొందించారు. జల జీవన్‌ మిషన్‌ నిధులు రూ.43.21 లక్షలతో 2.1 కిలోమీటర్లు పొడవునా హెచ్‌డిపిఇ పైపులైను పనులు జరుగుతాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి భూపతిరాజు వెంకట జగ్గరాజు మాట్లాడుతూ జల జీవన్‌ మిషన్‌ ద్వారా 2024 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇచ్చేందుకు ప్రణాళికను రూపొందించమన్నారు. ఈ పైప్‌లైన్‌ 8 అంగుళాలు 500 మీటర్లు, ఆ తర్వాత 6 అంగుళాలు, 5 అంగుళాలు సైజు గల పైపులైన్‌ పనులు చేపడతామని ఎంపిటిసి చిన్నాపరపు రాంబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి గ్రామ అధ్యక్షులు దాట్ల శ్రీనివాసరాజు, నాయకులు మంతెన రామకృష్ణంరాజు, దాట్ల బాపిరాజు, దాట్ల రామభద్రరాజు, ఆదియ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇన్‌ఛార్జి ఎఇ ఫణికుమార్‌ పాల్గొన్నారు.

➡️