బాలోత్సవం విజయానికి కృషి చేయాలి

యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి గోపీమూర్తి
ప్రజాశక్తి – భీమవరం
ఈ నెల 30, 31వ తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భీమవరం బాలోత్సవం కార్యక్రమం విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో భీమవరం బాలోత్సవం-1వ పిల్లల సంబరాలు కార్యక్రమల ఏర్పాట్ల సన్నాహాక సమావేశం యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి సిహెచ్‌.పట్టాభిరామయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీమూర్తి మాట్లాడుతూ బాలోత్సవం జయప్రదానికి యుటిఎఫ్‌ డివిజన్‌ మండల బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ కెవి రామభద్రం, బాలోత్సవం కమిటీ సభ్యులు సీతారామరాజు, అరుణ్‌, ధనుష్‌, జెవివి జిల్లా అధ్యక్షులు ప్రసాదరావు, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శులు ఏసుబాబు, రామకృష్ణ ప్రసాద్‌, కుమార్‌ బాబ్జి, భీమవరం, కాళ్ల, ఉండి బాధ్యులు అబ్రహం, నాగబాబు, స్వామి, శంకరరావు శామ్యూల్‌రాజు పాల్గొన్నారు.

➡️