ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి

శాసనమండలి ఛైౖర్మన్‌ కొయ్యే మోషన్‌రాజు

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించి, విజయవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు కోరారు. ఈ నెల 29వ తేదీ శుక్రవారం ముఖ్యమంత్రి భీమవరం బహిరంగ సభలో పాల్గొని విద్యార్థులకు విద్యా దీవెన నిధులను విడుదలు చేయనున్నారు. గురువారం ఈ సందర్భంగా హెలీప్యాడ్‌, సభావేదిక ప్రాంతాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌, నరసాపురం ఎంఎల్‌ఎ ముదునూరి ప్రసాదరాజు, రాష్ట్ర ప్రభుత్వవిప్‌ గ్రంధి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, ఎంఎల్‌సి తలశిల రఘురాం, శాసన మండలి సభ్యులు కవురు శ్రీనివాస్‌, జిల్లా ఎస్‌పి యు.రవి ప్రకాష్‌, జెసి ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డితో కలిసి మోషేన్‌ రాజు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి.శ్రీనివాసరాజు, ఎంబిసి ఛైర్మన్‌ పెండ్ర వీరన్న, డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు పాల్గొన్నారు.సిఎం పర్యటనపై కలెక్టర్‌ సమీక్షముఖ్యమంత్రి ప్రారంభించనున్న విద్యా దీవెన కార్యక్రమం విజయవంతానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఈనెల 29న జిల్లా పర్యటనను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వశిష్ట కాన్ఫరెన్స్‌ హాల్లో ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో, జిల్లా జాయింటు కలెక్టరు ఎస్‌.రామ్‌సుందర్‌ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టరు కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కలిపి 20 మందితో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రసంగించే సభాస్థలిలో చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ఉదయం 8.30 గంటలకే ప్రదర్శనలు మొదలు పెట్టాలన్నారు. 100 బస్సులకు, 700 చిన్న బస్సులకు వేర్వేరుగా పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు. విష్ణుకాలేజీ రోడ్డు కూడలిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. సభా వేదిక ప్రాంతంలో, బస్సుల్లో అల్పాహారం, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. హెలీప్యాడ్‌, సభాస్థలిని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ బి.శివన్నారాయణ రెడ్డి, ఎఎస్‌పి ఎవి.సుబ్బరాజు, ఆర్‌డిఒలు కె.శ్రీనివాసులు రాజు, ఎం.అచ్యుత అంబరీష్‌ పాల్గొన్నారు.

➡️