విఒఎలతో సరుకులు కొనిపించడం దారుణం

ప్రజాశక్తి – తణుకు రూరల్‌

వేల్పూరులోని మహిళా మార్ట్‌లో బలవంతంగా డ్వాక్రా గ్రూపు సభ్యులతో సరుకులు కొనిపించడం అన్యాయమని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ అన్నారు. గురువారం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం తహశీల్దార్‌ పిఎన్‌డి.ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి విఒఎలుగా పని చేస్తున్నా నేటికీ ఎలాంటి సౌకర్యాలూ లేకపోవడం బాధాకరం అన్నారు. వేల్పూరులో మహిళా మార్ట్‌లో సరుకులు సరసమైన ధరలకు కొనిపించాలని విఒఎలను అధికారులు వేధించడం ఆపాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలివ్వాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు వి.రత్నం, కార్యదర్శి ఎం.ఆదిలక్ష్మి, ఆకుల రాజేశ్వరి, వి.లీలావతి, జమున, ఇ.పద్మ, అడబాల పార్వతి, పి.కృష్ణవేణి పాల్గొన్నారు.

➡️