విద్యను అందరూ ప్రోత్సహించాలి

Jan 6,2024 22:22

డిఇఒ ఆర్‌వి.రమణ
ప్రజాశక్తి – కాళ్ల
విద్యను అందరూ ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌వి.రమణ అన్నారు. మండలంలోని కోపల్లెలో ఎస్‌ఎండిఆర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఐక్య నేషనల్‌ ఫౌండేషన్‌ భీమవరం (స్వచ్ఛంద సేవా సంస్థ) వారి ఐక్యత పద్మభూషణ్‌ సుధామూర్తి గ్రూపును జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌వి.రమణ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆర్‌వి.రమణను ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.నిర్మలాదేవి, ఫౌండేషన్‌ సభ్యులు, ఛైర్మన్‌ శివరామరాజు, సెక్రటరీ డివిఎస్‌.చంద్రాజీ, అధ్యక్షులు వైఎస్‌.ఆచారి, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.గోపాలరాజు, కె.సుబ్బరాజు, పాఠశాల స్థల దాత మంతెన రామ్‌కుమార్‌ రాజు, పాఠశాల అభివృద్ధి కమిటీ బంగార్రాజు, నల్ల విజయ లక్ష్మి, ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ నల్ల కిరణ్‌ప్రసాద్‌, పాఠశాల సెక్రటరీ ఎస్‌.మాణిక్యాలరావు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️