విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

పెనుగొండ:మండలంలోని అంబేద్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రిన్సిపల్‌ ఇస్తేర్‌, విద్యాశాఖ అధికారి పి.రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఇఒ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. పలివెల్లి శ్రీను మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ విద్యార్థులకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసి తాడి సుబ్బిరెడ్డి, వెలగల శ్రీనివాస్‌ రెడ్డి, సత్యనారాయణ, రమణ పాల్గొన్నారు.

➡️