వెంకటరత్నంకు సిపిఎం నేతల పరామర్శ

Dec 22,2023 21:52

ప్రజాశక్తి – యలమంచిలి
సిపిఎం సీని యర్‌ నేత మండలంలోని దొడ్డిపట్ల గ్రామానికి చెందిన కొల్లా వెంకటరత్నం సతీమణి తులసమ్మ (78) వృద్ధాప్య సమస్యతో బాధపడుతూ ఇటీవల మృతి చెందారు. ఆమెకు భర్త వెంకటరత్నంతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. తులసమ్మ మృతి వార్త తెలుసుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం వెంకటరత్నం కుటుంబ సభ్యులను పరామర్శించారు. తులసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారితో పాటు పార్టీ మండల కార్యదర్శి కానేటి బాలరాజు, సిపిఎం జిల్లా నాయకులు భాతిరెడ్డి జార్జి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

➡️