వెదుళ్లపాలెంలో డెంగీ కేసులు లేవు

Dec 4,2023 21:38

ఫీవర్‌ సర్వే నిర్వహించిన డాక్టర్‌ ప్రతాప్‌కుమార్‌
ప్రజాశక్తి – పాలకొల్లు రూరల్‌
లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వెదుళ్లపాలెంలో డాక్టర్‌ అడ్డాల ప్రతాప్‌కుమార్‌ ఆధ్వర్యంలో సోమవారం జ్వరాలపై సర్వే నిర్వహించారు. జ్వరాలతో బాధపడుతున్న నలుగురికి డెంగీ, మలేరియా పరీక్షలు నిర్వహించామని, ఎవ్వరికీ డెంగీ నిర్ధారణ కాలేదని తెలిపారు. గ్రామస్తులకు డెంగీ, మలేరియా వ్యాధులపై అవగాహన కల్పించామన్నారు. ఇటీవల గ్రామంలో జ్వరంతో మరణించిన ఇర్రింకి శంకరం కుటుంబసభ్యులకు డెంగీ కిట్లతో పరీక్ష చేయగా నెగిటివ్‌ వచ్చిందన్నారు. సీరం కలెక్ట్‌ చేసి డెంగీ నిర్ధారణ కోసం పరీక్షకు పంపించామని డాక్టర్‌ ప్రతాప్‌కుమార్‌ తెలిపారు. గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదని వార్డు మెంబర్‌ మాదు సుబ్రహ్మణ్యం, గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. పంచాయతీ సెక్రటరీ వారి దృష్టిలో పెట్టి పారిశుధ్యం చేసేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశామని డాక్టర్‌ ప్రతాప్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు, సబ్‌ యూనిట్‌ అధికారి కె.రాజ్‌కుమార్‌, హెల్త్‌ అసిస్టెంట్లు గోపాలకృష్ణ, దివాకర్‌బాబు, తారక సత్య, సత్తిరాజు, ఎంఎల్‌హెచ్‌పి మార్తమ్మ, ఎఎన్‌ఎంలు రోజాకమల, ఆదిలక్ష్మి, ఆశా కార్యకర్తలు విజయకుమారి, వెంకటలక్ష్మి, మేరీ ఆశీర్వాదం పాల్గొన్నారు.

➡️