సిఎం సారూ.. అరెస్టులతో బెదరం

ప్రజాశక్తి – ఆచంట

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు ఆచంట కచేరీ సెంటర్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ముందుగా ఆచంట, కోడేరు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిపిఎం నాయకులు సిర్రా నరసింహమూర్తి, వర్ధిపర్తి అంజిబాబు, టి.బుల్లబ్బాయి, సిర్రా విఘ్నేశ్వరుడు, కొండేటి రాఘవులు సమ్మెకు సంఘీభావం తెలిపారు.ఆచంట (పెనుమంట్ర) : సిఐటియు మండల కార్యదర్శి కోడే శ్రీనివాస ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అంగన్‌వాడీల దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు నల్లచీరలు ధరించి నిరసన తెలిపారు. అలాగే నేతల అక్రమ అరెస్టుకు నిరసనగా పెనుమంట్ర తహశీల్దార్‌ కార్యాలయం వద్ద రహదారిపై రాస్తారాకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కూసంపూడి సుబ్బరాజు, పెనుమంట్ర, మార్టేరు, ఆలమూరు సెక్టార్‌ లెటర్స్‌ సాయి మహాలక్ష్మి, మౌనిక పాల్గొన్నారు.గణపవరం : అంగన్‌వాడీల దీక్షలకు వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ సంఘీభావం తెలిపి మాట్లాడారు. కౌలు రైతు సంఘం మండల నాయుకులు పి.నరశింహమూర్తి, వ్వవసాయ కార్మిక సంఘం నాయుకులు, నరాలశెట్టి రామకృష్ణ, ఎస్‌.సంజీవరావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజా సంఘాలు నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా సరిపల్లిలో రాస్తోరోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడారు.తణుకు రూరల్‌ : అంగన్‌వాడీలకు జగన్మోహన్‌ రెడ్డి చెవిలో పువ్వులు పెట్టడం మానుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ అన్నారు. కోర్టు సెంటర్‌లో 18వ రోజు సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు వినూత్నంగా చెవిలో పువ్వులు పెట్టుకుని, నల్ల రిబ్బన్లతో నరేంద్ర సెంటర్‌ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బి.వసంత కుమారి, రాజకుమారి, కనకదుర్గ, మధుశీల, మణిమాలతీ, ప్రమీల పాల్గొన్నారు.పాలకొల్లు : జీతాలు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన సిఎం జగన్‌ తమ చెవిలో పువ్వు పెట్టారని మహిళా కమిషన్‌ మాజీ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి చెప్పారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన అంగన్‌వాడీల సమ్మెకు ఆమె సంఘీభావం తెలిపారు. అలాగే టిడిపి మహిళా నేత భవాని, సిఐటియు మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌ మద్దతు తెలిపారు.యలమంచిలి : అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరింది. స్థానిక సెంటర్లో అంగన్‌వాడీలు కొద్దిసేపు ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. 18వ అంకె ఆకారంలో నిల్చున్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి దేవ సుధాకర్‌, అంగన్‌వాడీ యూనియన్‌ నేతలు పాల్గొన్నారు.మొగల్తూరు : అంగన్‌వాడీలకు అండగా ఉంటామని జనసేన వీర మహిళలు అన్నారు. అంగన్‌వాడీల దీక్షలకు వారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వీర మహిళలు బొమ్మిడి సునీత, అంబటి అరుణ, పోలిశెట్టి నలిని, వలవల సావిత్రి మాట్లాడారు. అనంతరం అంగన్‌వాడీలకు శీతల పానీయాలు, బిస్కెట్లు అందజేశారు. బి.చంటి, ముక్కు గిరి, అందే కొండ, లక్కు బాబి పాల్గొన్నారు.నిరసన తెలిపేందుకు వెళ్లిన అంగన్‌వాడీలు, సిఐటియు నాయకులను అక్రమంగా నిర్బంధించడం దారుణమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ అన్నారు. సమ్మె నేపథ్యంలో రహదారిపై కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు పెద్దింట్లు, సారమ్మ, సీత, నాగలక్ష్మి, రేఖ శాంభవి పాల్గొన్నారు.పోడూరు : అంగన్‌వాడీల దీక్షలు 18వ రోజుకు చేరాయి. తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన నేతల అక్రమ అరెస్టును నిరసిస్తూ కవిటం సెంటర్‌ వద్ద పాలకొల్లు, మార్టేరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కౌన్సిల్‌ సభ్యులు పిల్లి.ప్రసాద్‌, పాలకొల్లు ప్రాజెక్ట్‌ లీడర్‌ పీతల రాజమణి, బొంతు శ్రీను, జె.ఉమాదేవి, రాయుడు కుమారి పాల్గొన్నారు.తాడేపల్లిగూడెం : అంగన్‌వాడీల, ప్రజాసంఘాల నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబూరావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షరాలు దీన స్వరూపారాణి నిరసన తెలిపారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద 18వ రోజు దీక్షలు కొనసాగాయి. అనంతరం పట్టణ పోలీసు స్టేషన్‌ ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. చింతకాయల బాబూరావు, స్వరూపరాణి మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, ప్రభారాణి, కనక మహాలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్న, గాయత్రి, వీరమ్మ, వెంకన్న పాల్గొన్నారు.నరసాపురం టౌన్‌ : పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్లో అంగన్‌వాడీలు చేపట్టిన దీక్షలు 18వ రోజుకు చేరాయి. సిఎం భీమవరం పర్యటనలో భాగంగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ, సిఐటియు నాయకుల అక్రమ అరెస్టును నిరసిస్తూ నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు జి.శ్రీలక్ష్మి, ఎ.నీలిమ, జి.రాజేశ్వరి పాల్గొన్నారు. వీరవాసరం : పోలీసులు అరెస్టు చేసిన అంగన్‌వాడీ నేతలను విడుదల చేయాలంటూ ఆందోళన చేపట్టారు. సిపిఎం నాయకులు జుత్తిగ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ వర్కర్లు బస్టాండ్‌ సెంటర్‌ నుంచి ర్యాలీగా వచ్చి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నాగరత్నం పాల్గొన్నారు.ఇరగవరం : సిఎం జగన్‌ అంగన్‌వాడీల చెవిలో పువ్వులు పెట్టాడని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు అడ్డగర్ల అజయకుమారి విమర్శించారు. ఈ మేరకు ఇరగవరంలో చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. అజయకుమారి, సిఐటియు నాయకులు కామన మునిస్వామి మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు డి.ప్రభావతి, ఎం.భవాని, డి.పెద్దిలక్ష్మి పాల్గొన్నారు.అత్తిలి : అంగన్‌వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ అంగన్‌వాడీలు శిబిరం వద్ద రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు. అలాగే బస్టాండ్‌ సెంటర్‌ నుంచి శిబిరానికి ర్యాలీగా వెళ్లారు. సమ్మెకు కౌలు రైతు సంఘం నాయకులు కేతా గోపాలన్‌, సిఐటియు నేతలు కర్రి ధర్మేంద్ర మద్దతు తెలిపారు.పెనుగొండ : అంగన్‌వాడీల దీక్షలు కొనసాగాయి. అయితే నేతల అరెస్టులపై అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల లీడర్‌ కె.తులసి మాట్లాడారు. అనంతరం బస్టాండ్‌ సెంటర్లో కెనాల్‌ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు మాదాసు నాగేశ్వరరావు, అంగన్‌వాడీలు, పరమేశ్వరి, నీలవేణి, ఉషశ్రీ, భవాని, నాగలక్ష్మి, శ్రీదేవి పాల్గొన్నారు.

➡️