సిఎస్‌సి వర్క్‌షాపులో ఎస్‌ఆర్‌కెఆర్‌ విద్యార్థుల ప్రతిభ

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌
సీనియర్‌ విద్యార్థులు ఖరీదైన నూతన టెక్నాలజీని జూనియర్లకు అందించి స్ఫూర్తిగా నిలవడంలో, వారిలో పోటీతత్వాన్ని, నూతన టెక్నాలజీపై ఆలోచన కలిగించేలా చేయడంలో భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు చేసిన కృషి అభినందనీయమని కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు అన్నారు. రెండేళ్లుగా రూ.వేలు వెచ్చించి మిషన్‌ లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఒటి) అధ్యాయం చేసిన ఫైనలియర్‌ సిఎస్‌సి విద్యార్థులు ప్రస్తుత రెండో సంవత్సరం విద్యార్థులకు ఎటువంటి రుసుము లేకుండా, సమయం వృధా కాకుండా రెండు రోజులు శిక్షణ అందించారని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కెవి.మురళీకృష్ణంరాజు అన్నారు. సిఎస్‌ఇ సెమినార్‌ హాలులో సిఎస్‌సి హెడ్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్స్‌ ఇచ్చిన శిక్షణలో నైపుణ్యం సాధించి కొత్త ప్రాజెక్టుల రూపొందించిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా సిఎస్‌సి హెడ్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ సిఎస్‌సి స్టూడెంట్స్‌ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్‌షాపులో 523 మంది విద్యార్థులు పాల్గొని 83 ప్రాజెక్టులు రూపొందించారని వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌కె.కామేశ్వరరావు, డాక్టర్‌ మహేష్‌, డాక్టర్‌ కవిత, ఆర్‌.శివశంకర్‌ పాల్గొన్నారు.

➡️