కళ్యాణ్ పై రౌడీ షీట్ తెరవాలి

May 27,2024 16:04 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం : కత్తితో దాడి చేసిన కళ్యాణ్ పై రౌడీ షీట్ తెరవాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్ బి చర్ల గ్రామస్తులు సోమవారం నరసాపురం డిఎస్పి జి.శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. వీరికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ (చిన్న) మద్దతు పలికారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన ఎల్ బి చర్ల గ్రామంలో ఉల్లంపర్తి కళ్యాణ్ అనే యువకుడు కత్తితో గ్రామానికి చెందిన కంచర్ల యుగంధర్, మణికంఠ, రామకృష్ణ లను కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్ర గాయమైన యుగంధర్ ప్రస్తుతం నరసాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నాడన్నారు. నిందితుడు బాధితులపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నాడన్నారు. శాంతిభద్రతలు విఘాతం కలగడానికి కళ్యాణ్ కారణంగా అన్నారు. అన్నదమ్ముల కలిసి ఉన్న గ్రామస్థులు మధ్య చిచ్చు పెట్టడన్నారు. ఎలక్షన్ కోడ్ సైతం లెక్కచేయకుండా హత్యయత్నం ప్రయత్నం చేశాడని, ఇదే యువకుడు నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని, పలు జాతరలో ఇలాగే వివాదాలు లేపడన్నారు . కళ్యాణపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రౌడీషీట్ తెరిచి రిమాండ్ కు పంపి, కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో యర్రంశెట్టి హరి,గుబ్బల భాను, సంగాని లక్ష్మణ స్వామి, కటకంశెట్టి మామాజీ, బొడ్డు ఆశిష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

➡️