వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలి

Dec 13,2023 12:09 #West Godavari District
anganwadi protest 2nd day wg undi

ప్రజాశక్తి-ఉండి(పగో): ఉండిలో రెండో రోజు అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హసీనా బేగం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కన్నా అధికంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి అంగన్వాడీలకు పై పరివారం విపరీతంగా పెంచేసాడని ఫేస్ యాప్ తీసుకురావడం వలన సర్వర్లు పనిచేయకపోవడంతో అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆమె గుర్తు చేశారు. వేతనంతో కూడిన మెడికల్ సెలవులను ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చే వరకు తమ ఉద్యమాన్ని వీడేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు ధనికొండ శ్రీనివాస్, నాయకులు మోపిదేవి రాము, సేనాపతి శ్రీనివాస్ మద్దతుగా పాల్గొన్నారు.

➡️