కుష్టువ్యాదిపై అవగాహన

Feb 5,2024 15:47 #West Godavari District
Awareness on leprosy

ప్రజాశక్తి-గణపవరం : మండలంలో సోమవారం కాశిపాడు గ్రామంలో స్థానికులకు పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పారామెడికల్ అధికారి పి రమేష్ మాట్లాడుతూ శరీరంపై స్పర్శ లేని మచ్చలు నరాల తిమ్మిర్లు కనుబొమ్మలు మూతపడకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే స్థానిక వైద్య సిబ్బందికి తెలపాలని చెప్పారు. స్థానిక ఆసుపత్రిలో ఆరు నెలలపాటు ఎం డి టి చికిత్స చేయించుకుంటే నివారించవచ్చు నని చెప్పారు. ఈ సందర్భంగా పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఏ ఆర్ కే పరమేశ్వర రావు తెర్లి కృష్ణారావు రోగులకు పళ్ళు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నోడల్ పర్సన్ నామాల రాజు ఏఎన్ఎం శివకుమారి వసంత పాల్గొన్నారు.

➡️