నరసాపురంలో కేంద్రం బృందం పర్యటన

Feb 17,2024 13:12 #West Godavari District
Center team visit to Narasapuram

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): జల జీవన్ మిషన్, స్వచ్ భారత్ పనులను వాటర్ శానిటేషన్ హైజానీ (వాష్) కేంద్రం బృందం శనివారం మండలం పర్యటించారు. మండలంలోని ఎల్ బి చర్ల గ్రామ సచివాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రతినిధులు కె.రాఘవేంద్ర, రాన్ సేన్ నేగి జలజీవన్ పనులు ప్రగతి పై స్థానిక అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు. ఇంటిటికి త్రాగు నీరు, స్వచ్ భారత్ లో మరుగుదొడ్లు దొడ్లు నిర్మాణం, జలజీవన్ మిషన్ లో వాటర్ కనెక్షన్ కొత్తవి ఎన్ని ఇచ్చారని ఆరా తీశారు. రిజిస్టర్ లలో వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. 15వ ఆర్ధిక సంఘము నిధులు వినియోగం, జల జీవన్ మిషన్ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖ సభ్యులు నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కేంద్ర అధికారి కె.రాఘవేంద్ర గ్రామస్తులతో తెలుగు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. త్రాగు నీరు స్వచ్ఛతపై ఫ్లోర్ టెస్ట్ చేయించారు. అనంతరం స్థానిక పాఠశాలలో మరుగుదొడ్లు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో త్రాగునీరు వస్తుందా? ఇంటి నుండి ఎందుకు నీరు తెచ్చుకుంటున్నారు అని వివరాలు అడిగారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుబ్బల యమునా, జిల్లా త్రాగు నీటి కార్యనిర్వాహక ఇంజనీర్ ఏఎస్ రామస్వామి, జిల్లా డీపీఎం నవాజ్, డిస్టిక్ కో ఆర్డినేటర్ వర ప్రసాద్, స్వచ్ భారత్ మిషన్ కో ఆర్డినేటర్ దినేష్, గ్రామ కార్యదర్శి పొత్తూరి లక్ష్మీపతి రాజు, నాయకులు గుబ్బల భాను మూర్తి , బొడ్డు ఆశిష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

➡️