కొనసాగిన వేసవి శిక్షణ శిబిరాలు

ప్రజాశక్తి – నరసాపురం

ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా గురువారం పిల్లలకు కథలు చెప్పడం, కథలు చెప్పించడం, నాయకుల జీవిత చరిత్రలు చదివించారు. అనంతరం లయన్స్‌ క్లబ్‌ జిల్లా ఛైౖర్మన్‌ ఎ.నలినీదేవి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం వాటి ఉపయోగాలు, లయన్స్‌ ఇంటర్నేషనల్‌ సేవా సంస్థల గురించి వివరించారు. ఈ సందర్భంగా పిల్లలకు మొక్కలు, స్నాక్స్‌ పంపిణీ చేశారు. స్పోకెన్‌ ఇంగ్లీష్‌, యోగా, మెడిటేషన్‌, గణితంలో మెలకువలు, క్రాఫ్ట్‌లో శిక్షణ ఇచ్చారు. స్కూల్‌ అసిస్టెంట్‌ జి.శ్రీనివాస్‌, స్కూల్‌ హెచ్‌ఎం నాగలక్ష్మి, సుధీర్‌ మోహన్‌, సూర్యంబాబు, ప్రవీణ్‌, జీవన్‌ రిసోర్స్‌ పర్సన్స్‌గా వ్యవహరించారు. జూన్‌ ఏడో తేదీ వరకూ జరిగే ఈ సమ్మర్‌ క్యాంపులో పిల్లలందరూ పాల్గొనాలని గ్రేడ్‌ వన్‌ లైబ్రేరియన్‌ కెజెఎస్‌ఎల్‌.కుమారి తెలిపారు. గణపవరం:గణపవరం గ్రంథాలయంలో గురువారం విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించినట్లు గ్రంథాలయ అధికారి సుభాషిని తెలిపారు. శిక్షణ శిబిరంలో విద్యార్థులకు నీతి కథలు చిత్రలేఖనం, చెస్‌, క్యారమ్స్‌ వంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు. ఈ శిబిరాన్ని విద్యార్థినులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి సుబ్బారావు చదువుల సంఘ నాయకులు పాల్గొన్నారు.

➡️