సమానత్వమున్న దేశాల్లో అభివృద్ధి

Mar 8,2024 15:52 #West Godavari District

ప్రజాశక్తి- నరసాపురం: ప్రపంచ దేశాల్లో స్త్రీకి సమానమైన హక్కులు ఉన్న దేశాలు చాలా అభివృద్ధి చెందాయని నెహ్రూ యువజన కేంద్రం ఏరియా సూపర్వైజర్ కె. కుసుమా అన్నారు. వైన్ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ జిల్లా నెహ్రూ యువజన కేంద్రం వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కె.కుసుమా ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. మనదేశంలో ఇంకా ఆడపిల్లలపై సరైన అవగాహన కొందరిలో లేదన్నారు .మగ బిడ్డతో సమానంగా ఆడపిల్లలను సమ భావంతో చూస్తే కుటుంబాలలో సంతోషం ఉంటుందన్నారు. మహిళా దినోత్సవం మహిళలను నూతన ధైర్యం వచ్చి విద్య ద్వారా అభివృద్ధిని సాధించి మహిళలు ఎవరు కాలపై వాళ్లు నిలబడాలని అన్నారు.తొలుతుగా ర్యాలీని నిర్వహించారు .ఈ సందర్భంగా సభాధ్యక్షులు ప్రిన్సిపల్ సిహెచ్. కనకారావు మాట్లాడుతూ అన్ని రంగాల్లో ముందున్నప్పుడు దేశం పురోభివృద్ధి చెందుతుందన్నారు .ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ ఎస్. యాకోబు ,వాలంటరీ పాల్గొన్నారు.

➡️